పేదలకు వరంగా గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా ప్రారంభించారు. గాంధీ వైద్యులు అద్భుతం సృష్టించారు. ఐవీఎఫ్ చికిత్సను అందించి.. ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో ఐవీఎఫ్ చికిత్స కోసం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేస్తుండగా.. గాంధీ ఆసుపత్రిలో మాత్రం ఉచితంగా చికిత్స అందించి మహిళ గర్భం దాల్చేలా చేశారు. తాజాగా గాందీ డాక్టర్ల బృందం విజయవంతంగా ప్రసవం చేసింది.

