ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం పాలనలో శివ మాలధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్నారని ఆరోపించారు. భక్తితో, నమ్మకంతో ఒకప్పుడు తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళన, అనిశ్చితితో దేవాలయాలకు వస్తున్నారని.. దీనిని చూస్తే ఏపీలో పరిస్థితి అర్థమవుతుందన్నారు. శ్రీశైలంలో శివస్వాముల ఆందోళనను ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలపై జగన్ విమర్శలు గుప్పించారు.

