తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. రేపు (ఫిబ్రవరి 11) రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,996 వార్డులకు గాను 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 26 లక్షలకు పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది.

