వివిధ అభివృద్ధి ,సంక్షేమ సూచికల ఆధారంగా 175 నియోజకవర్గాల ర్యాంకింగ్స్ ఇచ్చింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలు ఏ ప్లస్ (A+) గ్రేడ్ సాధించగా, 153 నియోజకవర్గాలు ఏ గ్రేడ్ దక్కించుకున్నాయి. కేవలం ఒకే ఒక నియోజకవర్గం బి గ్రేడ్‌కు పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలోనే 93 శాతం మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎమ్మెల్యే సుజనా చౌదరి మార్క్ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. రెండవ స్థానంలో నిలిచిన గాజువాకకు 92 మార్కులు వచ్చాయి.

