ఈనెల 12న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఉమ్మడి సన్నాహాక సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ అశోకా కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం రైతు, కార్మిక, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.

