మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత మంచినీటితో ప్రజల మరణాలకు ప్రభుత్వ నిర్లక్షమే కారణం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాహుల్ శనివారం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే స్వచ్ఛమైన నగరమనే బిరుదు పొందిన నగరంలో , బిజెపి ప్రభుత్వం ప్రకటించిన ఈ మోడల్ స్మార్ట్ సిటీలో ప్రజలకు తాగేందుకు మంచినీరు కూడా లేదని ఆయన స్పందించారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వ నిర్వాకంతోనే ఈ దుస్థితి నెలకొందని రాహుల్ తెలిపారు.

