దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ 22కోట్ల 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. గత డిసెంబర్లో భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుకావడంపై దర్యాప్తు జరిపిన డీజీసీఏ ఈ
చర్యలు తీసుకుంది. వందలాది విమాన సర్వీసులకు అంతరాయం నేపథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా నివేదిక ఆధారంగా జరిమానా విధించింది. డిసెంబర్ మొదటి వారంలో 2 వేల 507 విమానాలు రద్దు కాగా,
18వందల సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు కమిటీ గుర్తించింది.

