సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ‘రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ’ పేరుతో వస్తున్న మీమ్స్, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక గోళీల ఫ్యాక్టరీని నడుపుతున్నారని, ఆయన కోట్లలో సంపాదిస్తున్నారని, అందులో లక్షల్లో జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల యూట్యూబ్‌లో ఓ వ్యక్తి “రాజశేఖర్ గోటిల ఫ్యాక్టరీ” పేరుతో వీడియో చేశాడు.ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్‌లలో పెద్ద ట్రెండ్‌గా మారింది. ఇది పూర్తిగా ఫేక్ & మీమ్ ట్రెండ్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

