ప్రజలకు పరిపాలన ఫలాలు అందకుండా జిల్లాల పునర్విభజన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల రద్దుపై చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

