ప్రముఖ సోషల్ మీడియా వేదికలైన Instagram, Facebookలలో కొత్త ‘సిరీస్’ ఫీచర్ తీసుకురావడానికి మెటా ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు మల్టిపుల్ రీల్స్ సిరీస్ లు చేసే అవకాశం ఉంటుంది. వారు తమ రీల్స్ ఒకే సిరీస్ లోని వేర్వేరు ఎపిసోడ్లుగా కలిపి ప్రేక్షకులకు అందించవచ్చు.ఈ కొత్త సౌకర్యంతో పలు వీడియోలను వీక్షకులు ఒకేచోట చూడగలుగుతారు. అలాగే, కొత్త వీడియోలతో పాటు పాత రీల్స్ ను కూడా సిరీస్ లో చేర్చే అవకాశం ఉంటుంది.