మైలవరంలో టీడీపీ నేతల అరెస్ట్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ ముఖ్య నేతలు ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి (పెద్దబాబు), రమేష్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీరును ప్రశ్నించినందుకే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. గతంలోనే ఎమ్మెల్యేను నిలదీసినందుకు ఈ నేతలకు షోకాజ్ నోటీసులు అందాయి. ఇప్పుడు అరెస్ట్ చేయడం వెనుక ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై గళం ఎత్తినందుకు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.