దేశ భక్తి, పోరాటాల గురించి మేము పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కచ్చితంగా ఈ భూమిపుత్రుల జాగీరేనని…పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు నటుడిగా అభిమానిస్తాము, సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాము కానీ మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోము అన్నారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాము కదా మళ్లీ మీ పెత్తనం ఎందుకు? అని ప్రశ్నించారు. 2023లో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని అడ్డుకున్నారు అన్నారు.