దక్షిణ ఢిల్లీలో బుధవారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మాలవీయ నగర్ పరిధిలోని హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్టారెంట్ బేస్మెంట్లో చిక్కుకుపోయిన ముగ్గురు నైజీరియన్ పౌరులను ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ, మంటల కారణంగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.