అంతర్గత విభేదాలతో టిఎంసిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని TMC నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన బెంగాల్ అసెంబ్లీకి చేరుకోవడంతో పార్టీలో చీలిక బయటపడింది. టీఎంసీ తిరుగుబాటు వర్గం ఆయనను కొత్త ప్రతిపక్ష నేతగా (LoP) ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎంసీ పార్టీని చీల్చి, గుర్తును సొంతం చేసుకునేందుకు దాదాపు 59 మంది ఎమ్యెల్యేలు యత్నిస్తున్నట్లు స్వయంగా తృణమూల్ అధికార ప్రతినిధి రిజుదత్తా ప్రకటన చేయడం గమనార్హం.