రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, తాము ఎల్లప్పుడూ అధికారంలోనే ఉంటామని భావిస్తే వారు మూర్ఖులవుతారని కేటీఆర్ హితవు పలికారు. “అభివృద్ధి చేయలేదని అడిగితే.. ఎంత కండలు తిరిగిన పెహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? అని సీఎం అంటున్నారని, సరే మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి? నపుంసకులు అనాలా?” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణను తాము బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.