ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా దీర్ఘకాలం మనుగడ సాగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నిర్వహించిన లలిత పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లలిత ఆసుపత్రి భవిష్యత్తులో ఒక ల్యాండ్‌మార్క్ వైద్య సంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, “సంజీవని” పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకొస్తున్నామని వెల్లడించారు. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు చెప్పారు.