loader

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో 62.5 శాతం పోలింగ్..

రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో గురువారం సాయంత్రం 5 గంటల వరకు 62.5 శాతం ఓటింగ్  నమోదయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లా కందుకూరులో 76.07 శాతం, మార్కాపురం జిల్లా పొదిలిలో 75.68 శాతం, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 75.13 శాతం అత్యల్పంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 53.93 శాతం పోలింగ్ నమోదు, నెల్లూరు జిల్లా గూడూరులో 54.28 శాతం, కృష్ణా జిల్లా తాడిగడపలో 55.81 శాతానికి ఓటింగ్ […]

రాహుల్ గాంధీ ఫొటో పెడితే బ్లాక్ చేస్తున్నారు.. మెటాపై కోర్టుకెక్కిన కాంగ్రెస్..

సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటాతో కాంగ్రెస్ పార్టీ వివాదం మరింత ముదిరింది. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ పేరుతో లేదా ఆయన ఫొటోలతో పెట్టే పోస్టులను మెటా సంస్థ ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ పేరుతో, ఆయన ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని మెటా ఆటోమేటిక్ విధానంలో గుర్తించి బ్లాక్ చేస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, నివాళులు, పెళ్లి ఆహ్వాన పత్రిక వంటి సాధారణ పోస్టులు కూడా తొలగింపునకు గురయ్యాయని కాంగ్రెస్ […]

ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం.. నంది అవార్డులపై క్లారిటీ

తెలుగు చలనచిత్రం, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి నంది అవార్డుల ప్రధానోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2017-2015 సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల ఎంపికకు వేర్వేరు జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసింది. 2025 సంవత్సరానికిగానూ జాతీయ పురస్కారాల ఎంపిక కమిటీకి ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఎస్.గోపాల్ రెడ్డి, ప్రభలతో పాటు ఎపి స్టేట్ ఫిలిం, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండిని సభ్యులుగా […]

ఈ నెల 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. తెరపైకి పునర్విభజన

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్‌సభను ఈ నెల (నవంబర్) 30న, రాజ్యసభను వచ్చే నెల (డిసెంబర్) 3న సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సమావేశాలు డిసెంబర్ మూడో తేదీ వరకు ఉంటాయని ఆయన తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల ఆమోదం దిశగా బీజేపీ కసరత్తులు చేస్తోందనే ఊహాగానాల నడుమ […]

ఒక్క ఓటుతో సర్పంచ్‌గా విజయం

యద్దనపూడి మండలం వెస్ట్ పెద్దివారిపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తెదేపా మద్దతు అభ్యర్థి కొల్లా శివపార్వతి విజయం సాధించారు. తెదేపా సర్పంచ్ అభ్యర్థి ప్రత్యర్థితో హోరాహోరీ పోరులో సమాన ఓట్లు సాధించగా, పోస్టల్ బ్యాలెట్ ఒక్క ఓటు ఆమె విజయాన్ని నిర్ణయించింది. ప్రత్యర్థికి 132 ఓట్లు, శివపార్వతికి 132 ఓట్లు రావడంతో తొలుత పోటీ నువ్వా– నేనా అన్నట్లుగా సాగింది. అయితే పోస్టల్ బ్యాలెట్లో శివపార్వతికి అదనంగా ఒక ఓటు రావడంతో మొత్తం 133 ఓట్లతో ఒక్క […]

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో విడుదల

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2027 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘పిడిఏ కా ప్రణపత్రం’ అనే శీర్షికతో తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. తక్షణ రైతు రుణమాఫీతో పాటు 23 రకాల పంటలు, పాలకు కనీస మద్దతు ధర • బీపీఎల్ కు దిగువన ఉన్న ప్రజలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వృద్ధ మహిళలు సహా కార్మికులు, కళాకారులకు ఏడాదికి 40వేల పింఛను • సమాజ్ వాదీ క్యాంటీన్లలో రూ.5కే పేదలు, […]

CJP నేత సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసులు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేత సౌరవ్ దాస్‌కు సంబంధించి లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. సౌరవ్ దాస్‌ పాస్‌పోర్టులోని వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న కారణంతో మహారాష్ట్ర పోలీసుల అభ్యర్థన మేరకు ఈ నోటీసు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ఆయన నివాస చిరునామా కొన్ని పత్రాల్లో ఢిల్లీగా.. మరికొన్ని పత్రాల్లో పుదుచ్చేరీగా నమోదై ఉందని పేర్కొన్నారు. విద్యాభ్యాస వివరాలు, పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రుల వివరాలపైనా అనుమానాలు […]

మిస్ యూనివర్స్ విజేతపై విమర్శలు.. అంతా ముందే ఫిక్స్ అంటూ నెటిజన్ల ఫైర్..

ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే ఆమె విజయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో న్యాయనిర్ణేతల నిర్ణయం సరిగ్గా లేదని, విజేతను ముందుగానే నిర్ణయించారేమోనని కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ తరఫున పాల్గొన్న బీ మిల్లన్-విండోర్స్కీ సమాధానాలు, ప్రదర్శన బాగున్నాయని, ఆమెకే కిరీటం దక్కాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు జెన్నిఫర్ మాత్రం తలపై ప్రత్యేకమైన అలంకరణ ధరించి, హెడ్‌ఫోన్స్ కూడా పెట్టుకున్నారు. దీంతో ఆమెకు ఇతరుల సమాధానాలు వినిపించే […]

ఉద్యోగులకు 15 రోజుల పెటర్నిటీ సెలవులు

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇప్పటివరకు మహిళా ఉద్యోగులకు మాత్రమే ప్రసూతి సెలవులు అందుబాటులో ఉండగా.. తాజాగా పురుష ఉద్యోగులకూ పితృత్వ సెలవులు (Paternity Leave) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. భార్య ప్రసవానికి 15 రోజుల ముందు లేదంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఈ 15 […]

బ్యాలెట్ బాక్సు ధ్వంసం చేసిన వైకాపా శ్రేణులు.. పలుచోట్ల ఉద్రిక్తత

పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 10వ వార్డు పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సు పగులగొట్టేందుకు కొందరు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డారని ఇరువర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరులో పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన వైకాపా శ్రేణులు బ్యాలెట్ బాక్సు పగులగొట్టి పత్రాలను చించివేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకి చేరుకుని ఆందోళన చేస్తున్న […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON