తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇప్పటివరకు మహిళా ఉద్యోగులకు మాత్రమే ప్రసూతి సెలవులు అందుబాటులో ఉండగా.. తాజాగా పురుష ఉద్యోగులకూ పితృత్వ సెలవులు (Paternity Leave) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. భార్య ప్రసవానికి 15 రోజుల ముందు లేదంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవులను ఉపయోగించుకోవచ్చు.