కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన మత్స్యకారులు ఈనెల 4న సముద్రంలో వేటకు వెళ్లారు. ఈనెల 14 వరకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. చివరిగా వీరి బోటు ఒడిశాలోని పారాదీప్ సమీపంలో కనిపించిందని.. మరో బోటులో వేటకు వెళ్లి వచ్చిన మత్స్యకారులు చెప్పడంతో అక్కడే ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం మత్స్యకారుల ఫోన్ సిగ్నల్ అందింది. సురక్షితంగా ఉన్నట్టు తెలియడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.