ఈజిప్ట్ రాజధాని కైరోలో అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందగా, మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది రింగ్ రోడ్డు సమీపంలో ట్యాంకర్ వెళ్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి ముందు పడింది. దీంతో అదుపుతప్పిన ట్యాంకర్ బోల్తాపడింది. పెట్రోల్ రోడ్డుపై లీకవడంతో మంటలు వ్యాపించి పలు వాహనాలు దగ్ధమయ్యాయి.