మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది. ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో సీఎంతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి ఓటు వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బాధ్యత కలిగిన ప్రతి పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు వేస్తేనే ఏదైనా అడిగే హక్కు ఉంటుందన్నారు. డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు.