రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు, 23 పట్టణ స్థానిక సంస్థలకు రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు వేయడానికి పల్లెలు, పట్టణాల్లో ఓటర్లు ఉదయం నుంచే పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేటలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. అదే జిల్లా టి.నర్సాపురంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గోస్పాడు, హాలహర్వి ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి తరలివచ్చారు.