బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి హసీనా స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లాలనుకోవడం, ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అధికారిక అభ్యర్థన రెండూ వేర్వేరు అంశాలని భారత్ స్పష్టం చేసింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికే చేసిన అధికార అభ్యర్థనను నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది డిసెంబర్ 16న హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. అది షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశమని చెప్పారు. దీనిపై అంతకుమించి వ్యాఖ్యానించబోమని తెలిపారు