తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భూరీ విరాళం సమర్పించారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు చేతుల మీదుగా విరాళం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్దమాన్ జైన్ 121 కిలోల బంగారు ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ శ్రీవారికి అలంకరించే అన్ని రకాల ఆభరణాలు తయారు చేయించారు. శ్రీవారి శిరస్సు నుంచి పాదాల వరకు అన్నిరకాల ఆభరణాలను విరాళంగా అందజేశారు.