పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. 10వ వార్డు పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సు పగులగొట్టేందుకు కొందరు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బూత్ క్యాప్చరింగ్కు పాల్పడ్డారని ఇరువర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరులో పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన వైకాపా శ్రేణులు బ్యాలెట్ బాక్సు పగులగొట్టి పత్రాలను చించివేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకి చేరుకుని ఆందోళన చేస్తున్న ఇరువర్గాలను చెదరగొట్టారు