రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల పోలింగ్లో గురువారం సాయంత్రం 5 గంటల వరకు 62.5 శాతం ఓటింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లా కందుకూరులో 76.07 శాతం, మార్కాపురం జిల్లా పొదిలిలో 75.68 శాతం, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 75.13 శాతం అత్యల్పంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 53.93 శాతం పోలింగ్ నమోదు, నెల్లూరు జిల్లా గూడూరులో 54.28 శాతం, కృష్ణా జిల్లా తాడిగడపలో 55.81 శాతానికి ఓటింగ్ పరిమితమైంది.

