తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. పాల్వంచలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు.