రూ.62,370 కోట్ల ఎరువుల సబ్సిడీకి క్యాబినెట్ ఓకే!
రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు రైతులకు ప్రాథమిక ఎరువులైన భాస్వరం, పొటాష్ ఎరువులు భారం కాకుండా చూసేందుకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్బీఎస్) విధానం కింద అందించేందుకు వీలుగా ఏకంగా రూ.62,370 కోట్ల భారీ సబ్సిడీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించే వారికి ఎలాంటి షూరిటీలు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ‘ప్రధాన్ మంత్రి ముద్రా యోజన’కు, ముద్రా రుణాల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం […]

