జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఏకంగా కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపు మీద ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు బైకు మీద వచ్చిన గుర్తుతెలియని దుండగులు సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని అనంత్ నాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించగానే ఉగ్రవాదులు తోకముడిచారు.

