కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఆకస్మికంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ రోజు రాత్రి విశాఖ చేరుకుని రేపు సీఐఐ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. అమిత్ షా స్థానంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీఐఐ సదస్సును ప్రారంభించబోతున్నారు.అయితే పర్యటన రద్దు చేసుకోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.

