విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో నలుగురు సజీవదహనం!
విజయవాడ నగర శివార్లలోని పశ్చిమ బైపాస్ రహదారిపై సోమవారం ఘోర రహదారి ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గురై, క్షణాల్లో అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. ఈ దుర్ఘటనలో కారులోని నలుగురు వ్యక్తులు బయటకు రాలేక అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో బయటపడ్డాడు. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై, తిరిగి స్వగ్రామానికి పయనమవుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

