సౌదీ అరేబియా లోని దమ్మామ్ లోని కింగ్ ఫహాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పై ఆదివారం అర్ధరాత్రి హూతీ రెబల్స్
క్షిపణులతో విరుచుకుపడ్డారు. దమ్మామ్ లో
జరిగిన దాడిలో నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా రెండో విడత దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సౌదీ అరేబియా ఎయిర్పోర్టులకు ప్రయాణికులు, విమానాలు వెళ్లొద్దని హూతీలు హెచ్చరికలు జారీ చేశారు. తమపై సౌదీ దాడులు నిలిపివేసే వరకు తాము వెనక్కి తగ్గమన్నారు.