అక్టోబర్ 10న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలో అమ్మాయిలు, మహిళలు, ఇతర విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాము హిందూ రక్షా దళ్‌కు చెందినవారమని చెప్పుకున్న ఈ వ్యక్తులు.. ఆ ముసుగులో డీడీయూ మార్గ్‌లో నిరసనకారులను కొట్టడం, మహిళలను తోసివేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.