అమితాబ్ బచ్చన్
అమితాబ్ హరివంశ్ బచ్చన్ (జ.1942 అక్టోబరు 11) భారత సినీ నటుడు. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెందారు.<span;>భారత ప్రభుత్వం 1984లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషన్, 2015లో పద్మవిభూషన్ పురస్కారాలతో గౌరవించింది. అంతర్జాతీయ సినిమా రంగంలో అతను చేసిన కృషికిగానూ ఫ్రెంచి ప్రభుత్వం ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన లెగియన్ ఆఫ్ హానర్ పురస్కారం అందించింది

