జంతర్ మంతర్ 2.O. నిరసనల నేపథ్యంలో అరెస్ట్ అయిన సీజేపీ నేతలు ఆదివారం విడుదలయ్యారు. విడుదల అనంతరం సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విషాదాలు,రాజకీయ ఒత్తిళ్లు తమ ఉద్యమాన్ని ఆపలేవని స్పష్టం చేశారు. నిరసనలను కొనసాగిస్తామని, మళ్లీ వీధుల్లోకి వస్తామని ప్రకటించారు.సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపును కోరుతూ ఇకపై నిరసనలు చేపట్టబోమని తెలిపే ఎలాంటి బాండ్లపై తాము లేదా ఇతర సీజేపీ నాయకులు సంతకం చేయలేదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.