ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఆదివారం గాల్లో ఉండగానే తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. క్యాబిన్ లోపల ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి విషమించకముందే అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగాన్ని సంప్రదించి, అత్యవసర అనుమతితో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.