తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. దేచర్ల సమీపంలోని క్వారీ వద్ద పెద్దపులి తిష్ట వేయడంతో ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ క్వారీ వద్దే సేదతీరుతున్న పులిని ఎలాగైనా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. పులికి ఎలాంటి హాని కలగకుండా, అలాగే సిబ్బందికి ప్రమాదం జరగకుండా దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.