ఆఫ్రికా దేశమైన జిబూటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు మృతి చెందారు. మరణించిన వారిలో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. మరో 116 మందికి పైగా గల్లంతయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ప్రకటించింది. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 350 మంది ఉన్నట్లు సమాచారం. జిబూటి నుంచి యెమెన్‌కు వెళ్తుండగా.. గుహెరే ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 80 మందికిపైగా ఇథియోపియా పౌరులు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.