తాజాగా స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ కళ్యాణ్ తమ పార్టీ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబుని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్డు మీదకు రాలేదు.. కానీ జనసైనికులు వచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలలో.. మా జనసేన పార్టీనే చాలా త్యాగం చేసింది అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.