ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా భారత్ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో రూ.13 వేల కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాల తయారీలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామన్నారు. 12 ఏళ్లలో అనేక రంగాల్లో మార్పులు తెచ్చినట్లు చెప్పారు. తయారీ రంగంలో వృద్ధి వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. తమిళనాడు అభివృద్ధికి అండగా ఉండటంతో పాటు విజయ్ ప్రభుత్వానికి చేయూత