ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో భాగంగా రూ.4,900 కోట్లతో నిర్మించిన పూందమల్లి–వడపళని కారిడార్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి పోరూరు నుంచి పూందమల్లి స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.13 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటు, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.