loader

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర.. కిలోకు 3.89 పెంపు

దిల్లీ, దాని పరిసర నగరాల్లో CNG ధరలు కిలోకు రూ.3.89 చొప్పున శనివారం ఉదయం నుంచి పెరుగుతాయని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ పెంపుతో దిల్లీలో CNG ధర ప్రస్తుతం కిలో రూ.83.09 ఉండగా, అది రూ.86.98కి చేరుతుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరగడమే ఈ పెంపునకు కారణమని IGL తెలిపింది.

అర్ధరాత్రి బంధువులకు మెసేజ్.. వచ్చేసరికే ఫ్యామిలీ మొత్తం..

విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా మారడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య అహల్య, వారి మూడేళ్ల కుమార్తె రితిక్ష, ఏడాదిన్నర చిన్నారి హన్విక ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రవీణ్ కుమార్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భార్య, పిల్లలకు తొలుత విషం ఇచ్చి, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ […]

మ్యూజియంలో భారీ చోరీ.. 200 క్యారెట్ల వజ్రాల హారం మాయం

యూరప్ లో సినీ ఫక్కీలో సాగుతున్న మ్యూజియం దోపిడీల పరంపరలో మరో ఘటన వెలుగుచూసింది. ఆస్ట్రియాలోని ‘మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్’ లో శుక్రవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సాధారణ సందర్శకుల్లా టికెట్లు కొనుగోలు చేసి లోపలికి ప్రవేశించి, సుమారు 200 క్యారెట్ల ప్లాటినం- వజ్రాల హారంతో ఉడాయించారు. ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా వచ్చిన  దుండగులు ప్రదర్శన హాలులోకి వెళ్లి సుత్తితో డిస్ప్లే అద్దాల పెట్టెను పగులగొట్టి, ఆభరణాన్ని చేజిక్కించుకుని […]

తెలుగు భాష దినోత్సవం

ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకొంటాం సామాన్యులకు కూడా అర్థమయ్యేలా తెలుగు భాషను సరళీకరించి, వాడుక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన గిడుగు వారి సేవలకు గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

జాతీయ క్రీడా దినోత్సవం

జాతీయ క్రీడా దినోత్సవం, భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టిన రోజైన ఆగష్టు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ (1905 ఆగష్టు 29, – 1979) డిసెంబరు 3, తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా , తర్వాత కెప్టెన్ గా గుర్తించబడ్డాడు. […]

అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు 1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON