విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా మారడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య అహల్య, వారి మూడేళ్ల కుమార్తె రితిక్ష, ఏడాదిన్నర చిన్నారి హన్విక ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రవీణ్ కుమార్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భార్య, పిల్లలకు తొలుత విషం ఇచ్చి, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.