loader

భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో సూర్యాపేట, తాండూరు, సహా 12చోట్ల తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లి, హైదరాబాద్లోని ఏడీ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.

సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.1976లో విడుదలైన ‘అంతులేని కథ’ చిత్రం ద్వారా జీవీ నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, సహచర నటులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తేందుకు ఏపీ అధికారుల యత్నం..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ మొదలయ్యాయి. సాగర్ కుడికాలువ గేట్లను ఎత్తి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు చేపట్టిన యత్నాన్ని తెలంగాణ ఇంజనీర్లు తీవ్రంగా ప్రతిఘటించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేదా ఆదేశాలు లేకుండా గేట్లు ఎలా తెరుస్తారంటూ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

పల్నాడు  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు దగ్గర విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు చనిపోయారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు..  ప్రమాదంలో చనిపోయినవారిని చిలకలూరిపేట మండంల వేలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో  పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వేలూరు వెళ్తుండగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON