ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం మరోసారి న్యాయస్థానం ముందుకు వెళ్లింది. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తై, తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా వార్డు వారీ ఓటర్ల జాబితాలను తుది SIR జాబితా ఆధారంగానే రూపొందించాలని అప్పిరెడ్డి తన పిటిషన్లో కోరినట్లు సమాచారం.