డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. దాదాపు 23 రోజుల తరువాత మత్స్యకారుల ఆచూకీ లభించిందని జిల్లా కలెక్టర్ బుధవారం వెల్లడించారు. దాదాపు మూడు వారాల తరువాత మత్స్యకారులు ఎలా ఉన్నారు అనేది తెలిసేసరికి కుటుంబసభ్యులకు ప్రాణాలు లేచొచ్చినట్లు అనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్న కోనసీమ మత్స్యకారులను సురక్షితంగా ఏపీకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.