loader

5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్ చేస్తాం తేల్చి చెప్పిన కేజ్రీవాల్

రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారం చేపడితే, గోవాలో 2027 మార్చి 10 తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే E20  పెట్రోల్ అమ్మకాలపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తామని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ ఈ హామీని నెరవేర్చకపోతే తాను శాశ్వతంగా రాజకీయం నుంచే తప్పుకుంటానని శపథం చేశారు. E20 పెట్రోల్ వినియోగానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త నిరసన ప్రచారాన్ని మరింత […]

బీజేపీ ఓటమికి ఎవరితోనైనా పొత్తుకు రెడీ : అసదుద్దీన్ ఓవైసీ

వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలతో పొత్తుకు ఎంఐఎం సిద్ధమని, ఏ పొత్తులోనైనా తమకు గౌరవం, సమాన హోదా కావాలని డిమాండ్ చేశారు. పూర్తి బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒవైసీ ప్రకటించారు.

కోదాడ వద్ద రక్తసిక్తమైన రహదారి.. ఆరుగురిని మింగేసిన అతివేగం.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం (ఆగస్టు 26) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్‌తో ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మీలాద్ నబి

మౌలిద్ (అరబ్బీ :مولد) లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల ‘రబీఉల్-అవ్వల్’ 12వ తేదీన వస్తుంది. మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియాలో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా ‘మౌలిద్’ గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON