రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారం చేపడితే, గోవాలో 2027 మార్చి 10 తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే E20 పెట్రోల్ అమ్మకాలపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తామని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ ఈ హామీని నెరవేర్చకపోతే తాను శాశ్వతంగా రాజకీయం నుంచే తప్పుకుంటానని శపథం చేశారు. E20 పెట్రోల్ వినియోగానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త నిరసన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.