ఆపరేషన్ ఉడాన్ లో భాగంగా గజపతి పోలీసులు ఐదుగురు మైనర్ బాలికలకు విముక్తి కలిగించారు. రాయగడ-కంధమాల్-గజపతి సరిహద్దు ప్రాంతాల నుంచి మైనర్ బాలికలను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నేపథ్యంలో ఠాణా ఇన్స్పెక్టర్ నళిని కోరో ఓ బృందంతో హైదరాబాద్ వెళ్లి పలు ప్రాంతాల నుంచి మైనర్ బాలికలను రక్షించినట్లు తెలిపారు. ఐదుగురు మైనర్ బాలికలను హైదరాబాద్ నుంచి మంగళవారం గజపతి జిల్లాకు తీసుకుని వచ్చినట్లు వెల్లడించారు. ముఖ్య సూత్రధారి అయిన నిందితుడు
రాజ్ కుమార్ బాస్తారాయన్ను అరెస్టు చేసినట్లు వివరించారు.