అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ,సమాజ్వాదీ పార్టీల మధ్య హామీల పోరు తీవ్రస్థాయికి చేరింది.అఖిలేశ్ యాదవ్ ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ వేదికగా 10 భారీ హామీలతో ముందుకు వచ్చారు.పేద మహిళలకు ఏటా రూ.40 వేలు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఈ మొత్తాన్నిపెంచుతామని మాటిచ్చారు. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు,ప్రతి నెలా రెండు రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు, వితంతువులు, నిరుపేదలకు శాశ్వత గృహాల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.